Kaizer News

ఎన్నాళ్లైనా ఎదగని పిల్లి.. పులిలా ఉందేంటి?

ఎన్నాళ్లైనా ఎదగని పిల్లి.. పులిలా ఉందేంటి?

· National - India · sakshi.com

బొలీవియా: దక్షిణ అమెరికా దేశమైన బొలీవియా అడవుల్లో శాస్త్రవేత్తలు వందేళ్ల తర్వాత ఓ సరికొత్త పిల్లి జాతిని కనుగొన్నారు. దీనికి 'లియోపార్డస్ తిల్కాయో' (తిల్కాయో టైగర్ క్యాట్) అని నామకరణం చేశారు. స్థానికంగా 'టిగ్రినో' అని పిలిచే పదేళ్ల ఈ జీవిని అడవిలో మొదటిసారి చూసినప్పుడు, ఒక సాధారణ పెంపుడు పిల్లి పిల్లగా భావించారు. అయితే ఏళ్లు గడుస్తున్నా అది ఎదుగుదల లేకుండా చిన్నగానే ఉండటం, ఒంటిపై చిరుతను పోలిన మచ్చలు, గుండ్రటి చెవులు కలిగి ఉండటం పరిశోధకుల దృష్టిని ఆకర్షించింది. లా పాజ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీనిపై ప్రత్యేకంగా డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా, ఇది ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని సరికొత్త టైగర్ క్యాట్ జాతి అని తేలింది. ఆండీస్ పర్వతాలు, అమెజాన్ బేసిన్ కలిసే యుంగాస్ ప్రాంతంలో జీవించే ఈ అరుదైన జీవి ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు 'కరెంట్ బయాలజీ' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇలాంటి అడవి పిల్లుల సంరక్షణకు, ఇంకా వెలుగుచూడని జీవవైవిధ్యాన్ని గుర్తించడానికి ఈ పరిశోధన ఎంతో కీలకంగా మారనుంది. ఇదీ చదవండి: మీడియాపై ట్రంప్ ప్రతాపం.. ఆ దిగ్గజ సంస్థలకు నో ఎంట్రీ! మార్కెట్లోకి ఐఫోన్‌ 18 ఎంట్రీ...స్టోర్స్‌ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్‌ (ఫొటోలు) బిగ్ బాస్ బ్యూటీ తనూజ ‘హతః’ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు) ఖైరతాబాద్ మహా గణపతి...ట్యాంక్ బండ్‌పై సందడిగా నిమజ్జనం (ఫొటోలు) హైదరాబాద్‌ పంజాగుట్టలో సందడి చేసిన సినీ నటి రాశీ సింగ్ (ఫొటోలు) తిరుమల : సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకరణలో శ్రీమలయప్ప అభయం (ఫొటోలు) BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే

Original source: sakshi.com
Read more on Kaizer News