Kaizer News

Srikakulam | ప్రయాణికులు, డ్రైవర్లు సురక్షితం…

Srikakulam | ప్రయాణికులు, డ్రైవర్లు సురక్షితం…

· State - Telangana · prabhanews.com

Srikakulam | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పెను ప్రమాదం తప్పింది. భద్రాచలం నుంచి పలాస వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నరసన్నపేట జమ్ము జంక్షన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు వెనుక సీటు వద్ద మొదలైన మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. మంటలను గుర్తించిన వెంటనే ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్‌ హుటాహుటిన కిందకు దిగడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాద సమయంలో ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. బస్సు దగ్ధం కావడంతో జమ్ము జంక్షన్‌ వద్ద కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News