Kaizer News

Rajahmundry: వీధి కుక్కల నియంత్రణకు పటిష్ట చర్యలు.

Rajahmundry: వీధి కుక్కల నియంత్రణకు పటిష్ట చర్యలు.. ఎమ్మెల్యే!

· State - Telangana · hmtvlive.com

Shorts Rajahmundry: నగరంలో వీధి కుక్కల నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ అనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. క్వారీ ఏరియాలోని ఏబీసీ కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం అధికారులు, సిబ్బంది, జంతు ప్రేమికులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీసీ సెంటర్లో వీధి కుక్కలకు శస్త్రచికిత్సలు నిర్వహించడం, స్టెరిలైజేషన్ అనంతరం వాటికి అందిస్తున్న సంరక్షణ, యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్, ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించి తిరిగి ఆయా ప్రాంతాల్లో వదిలే ప్రక్రియపై ఎమ్మెల్యే వాసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో ఉన్న మౌలిక వసతులు, వైద్య పరికరాలు, సిబ్బంది, రోజువారీ నిర్వహిస్తున్న శస్త్రచికిత్సల సంఖ్య తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. నగరంలో సుమారు 25,865 వీధి కుక్కలను గుర్తించగా, ఇప్పటివరకు 15,126 కుక్కలకు స్టెరిలైజేషన్‌తో పాటు యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ చేసినట్లు అధికారులు ఎమ్మెల్యే వాసుకు వివరించారు. ఏబీసీ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేసి, క్రమం తప్పకుండా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News