ఏపీలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తన ప్రతాపం చూపించింది. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) చొల్లంగి నాగేశ్వరరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. బాధితుడు తన భూమికి సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని వీఆర్వో నాగేశ్వరరావును ఆశ్రయించాడు. అయితే.. చట్టబద్ధంగా జరగాల్సిన ఈ పనికి అధికారి లంచం డిమాండ్ చేశాడు. రూ. 16,500 […]