Kaizer News

నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ఇంటి ఎదుట తల్లి ధర్నా..

· State - Telangana · tv9telugu.com

జోగులాంబ గద్వాల జిల్లాలో 21 ఏళ్ల తర్వాత ఓ మహిళ తన కుమారుడితో కలిసి ఓ వ్యక్తి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి, కుమారుడు పుట్టిన తర్వాత పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. తన కుమారుడికి తండ్రి గుర్తింపు కావాలని డిమాండ్‌ చేసింది. అవసరమైతే DNA పరీక్షకు సిద్ధమని తల్లి, కుమారుడు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించి, కౌన్సిలింగ్ ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు

Original source: tv9telugu.com
Read more on Kaizer News