Kaizer News

భారత్‌, చైనాపై 100% సుంకాలు!

భారత్‌, చైనాపై 100% సుంకాలు!

· National - India · ntnews.com

రష్యా ఆంక్షల బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం 30 రోజుల్లోగా అమల్లోకి చట్టం వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 19: రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం సంతకం చేశారు. దీంతో అది చట్టంగా మారడానికి మార్గం సుగమం అయినట్టు వైట్‌ హౌస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. రష్యాతోపాటు భారత్‌, చైనా వంటి దాని ప్రధాన ఇంధన కొనుగోలుదారులపై భారీ సుంకాలు విధించాలని రష్యా, ఇరాన్‌పై ఆంక్షల చట్టం లక్ష్యంగా పెట్టుకొన్నది. రష్యా నాయకత్వం, దాని ఇంధన రంగంపైన, అలాగే ఆ దేశ రక్షణ పరిశ్రమ, దాని షాడో ఫ్లీట్‌కు సహకరిస్తున్న దేశాలపై ఆంక్షలు విధించే లక్ష్యంతో రూపొందించిన రష్యా, ఇరాన్‌పై ఆంక్షల చట్టాన్ని అమెరికా ప్రతినిధుల సభ బుధవారం(సెప్టెంబర్‌ 16) ఆమోదించింది. రష్యా నుంచి చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే చైనా, భారత్‌తో సహా ఇతర దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని కూడా ఈ చట్టం అధ్యక్షుడు ట్రంప్‌నకు కల్పిస్తుంది. చట్టం అమల్లోకి రావడానికి ముందున్న 12 నెలల కాలంలో రష్యా నుంచి చమురు లేదా సహజ వాయువును అత్యధిక పరిమాణంలో కొనుగోలు చేసిన మొదటి ఐదు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 100 శాతం వరకు సుంకాలు విధించాల్సి ఉంటుంది. నిర్దిష్ట కాలంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న గ్యాస్‌ పరిమాణం ఆ దేశ మొత్తం గ్యాస్‌ దిగుమతుల్లో 15 శాతం కంటే తక్కువగా ఉంటే సుంకాల నుంచి మినహాయింపు లభిస్తుంది. రష్యాపై ఆంక్షల బిల్లుపై సంతకం చేసినందుకు ట్రంప్‌కు, బిల్లుకు మద్దతునిచ్చినఅమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు

Original source: ntnews.com
Read more on Kaizer News