భవానిపురం, ఆంధ్రప్రభ : శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి బృందావన్ సేవాసమితి ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి 355 వ ఆరాధన మహోత్సవములు ఆదివారం, అత్యంత వైభవంగా జరిగాయి. గురు సార్వభౌముల ఆరాధన వేడుకలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు.. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 3000 వేల మంది భక్తులకు అన్న సమారాధన చేశారు. ఈ మహోత్సవము లలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి పాల్గొని శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. సెక్రటరీ నందిపాటి శివ శంకరరావు, జాయింట్ సెక్రెటరీ చేవూరి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ మద్ది సుబ్బారావు, కోశాధికారి కేదారి శెట్టి సూర్యనారాయణ గుప్త, కొల్లిపర శ్రీనివాసరావు, కొత్త గుళ్ళు కార్యదర్శి గొల్లపూడి శివకుమార్, విశ్వహిందూ పరిషత్ సహకార్యదర్శి కొంపెల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు