Shorts రంపచోడవరం: ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన కార్యక్రమంలో భాగంగా రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించు కోవడానికి సేవా సేతు క్యాంప్ రేపు అనగా శనివారం ఉదయం 10 గం. నుండి రంపచోడవరం కరెంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం నందు అవగాహన కార్యక్రమం జరుపబడును. ఈ కార్యక్రమంలో అధికారులు మరియు వెండర్లు (కాంట్రాక్టర్ లు ) కూడా పాల్గొని సోలార్ వినియోగం మరియు ప్రయోజనాలు వివరించడం జరుగుతుంది. కావున ఆసక్తి ఉన్న వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా రంపచోడవరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. పి. అచ్యుతాచారి ఒక ప్రకటలో తెలిపారు