Kaizer News

Iragavaram: ఘనంగా స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాలు - ఎ

Iragavaram: ఘనంగా స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాలు - ఎంపీడీవో శ్రీనివాసు

· State - Telangana · hmtvlive.com

Shorts ఇరగవరం: మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాసు అన్నారు. స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో భాగంగా ఇరగవరం మండలం 21 గ్రామ పంచాయతీల పరిధిలో శుక్రవారం స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు స్వచ్ఛత, వ్యర్థాల వేరు చేయడం, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. “స్వచ్ఛ పాఠశాల – యువత స్వచ్ఛత కోసం” అనే ప్రధాన ఉద్దేశ్యంతో పాఠశాల విద్యార్థులు, యువతలో స్వచ్ఛత, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగం, నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా RRR (Reduce, Reuse, Recycle) / Reuse Drives నిర్వహించి పుస్తకాలు, బొమ్మలు, దుస్తులు తదితర వస్తువుల సేకరణ, పునర్వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు,పంచాయతీ అభివృద్ధిఅధికారులు,పాఠశాలలప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్వర్ణ గ్రామ కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు, Eco-Clubs సభ్యులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News