Kaizer News

Kadiyam: కడియం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్

Kadiyam: కడియం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు!

· State - Telangana · hmtvlive.com

Shorts Kadiyam: ఈరోజు, సోమవారం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో కడియం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించనున్నట్లు కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ తెలిపారు. ఉదయం 11 గంటలకు పొట్టిలంక గ్రామంలో 4.88 కోట్ల రూపాయలతో నిర్మించే వంతెనకు (బ్రిడ్జి) శంకుస్థాపన. మధ్యాహ్నం 01:30 గంటలకు కడియపులంకలో 7.50 కోట్ల రూపాయల సాస్కి నిధులతో నిర్మించే రోడ్లకు శంకుస్థాపన నిర్వహిస్తారని, అలాగే మధ్యాహ్నం 02:30 గంటలకు మాధవరాయుడు పాలెంలో 7.50 కోట్ల రూపాయల సాస్కి నిధులతో నిర్మించే రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ నిమ్మల రామానాయుడు, పర్యాటక సాంస్కృతిక సినీమాటోగ్రఫీ శాఖామంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొంటారని ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News