Shorts Guntur: మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాల (MLEW), పుల్లడిగుంటలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్ ఆధ్వర్యంలో Cambridge English Language Programmeను ఘనంగా ప్రారంభించారు. Cambridge University Press & Assessment సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో అంతర్జాతీయ స్థాయి ఆంగ్ల భాషా నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కెరీర్‌కు అవసరమైన ప్రొఫెషనల్ సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి Cambridge University Press & Assessmentలో Multi-level Testing విభాగం Product Manager శ్రీ Ian Cawley ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత గ్లోబల్ వాతావరణంలో ఆంగ్ల భాషపై పట్టు, సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు విద్యార్థుల విద్యా మరియు వృత్తి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన వివరించారు. కళాశాల చైర్మన్ డా. మలినేని పెరుమాళ్లు మాట్లాడుతూ, విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా లభించే ఉన్నత విద్య మరియు ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆంగ్ల భాషా ప్రావీణ్యం, ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని పేర్కొన్నారు. Cambridge University Press & Assessmentతో కలిసి ప్రారంభించిన ఈ కార్యక్రమం విద్యార్థుల భవిష్యత్ ప్రగతికి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కళాశాల డైరెక్టర్ శ్రీ కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, విద్యార్థులను ప్రస్తుత పరిశ్రమ అవసరాలకు, అంతర్జాతీయ కెరీర్ అవకాశాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలకమని తెలిపారు. Cambridge English Language Programme ద్వారా విద్యార్థులు తమ భాషా నైపుణ్యాలను మెరుగుపరుచుకుని గ్లోబల్ అవకాశాలను మరింత ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్లేస్‌మెంట్ డైరెక్టర్ డా. కె. శ్వేత మాట్లాడుతూ, ప్రస్తుత నియామక ప్రక్రియల్లో సాంకేతిక నైపుణ్యాలతో పాటు English Communication, Presentation Skills, Group Discussion మరియు Interview Skillsకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. విద్యార్థుల employability skillsను పెంపొందించడంలో ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ డా. జె. అప్పారావు, వివిధ విభాగాల HODలు, డీన్లు, అధ్యాపకులు మరియు III B.Tech విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ, విద్యార్థులను “Communicate, Connect and Compete Globally” అనే లక్ష్యంతో తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ సంస్థల సహకారంతో మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆంగ్ల భాషా ప్రావీణ్యం, కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్ మరియు కెరీర్ రెడీనెస్ను మెరుగుపరుచుకునే విలువైన అవకాశం లభించింది