Kaizer News

వైభవ్‌ సూర్యవంశీ సంచలన నిర్ణయం

వైభవ్‌ సూర్యవంశీ సంచలన నిర్ణయం

· Sports · sakshi.com

టీమిండియా యువ సంచలనం, బ్యాటింగ్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని పేద, ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు వినియోగిస్తానని ప్రకటించాడు. అలాంటి విద్యార్థులు లేదా వారి గురించి తెలిసిన వారు తనను సంప్రదించాలని కోరాడు. నాకు సాధ్యమైన విధంగా సహాయం చేయడానికి సంతోషిస్తాను. తాను చేయబోయే సహాయానికి ఒక అర్థవంతమైన ప్రయోజనం కల్పిద్దామని పిలుపునిచ్చాడు. ఈ మేరకు ఇవాళ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఈ విషయాన్ని వైభవ్‌ నిన్ననే (ఆగస్ట్‌ 28) ఎక్స్‌ ద్వారా వెల్లడించాడు. 'గొప్ప విషయాలు రాబోతున్నాయి. చూస్తూ ఉండండి' అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. వైభవ్‌ గొప్ప మనసుకు సమస్త ప్రజానీకం ఫిదా అవుతుంది. 15 ఏళ్ల వయసులో వైభవ్‌ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడని జనాలు కొనియాడుతున్నారు. వైభవ్‌ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ప్రతి ఒక్కరు అతడికి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కాగా, వైభవ్‌ స్వతహాగా ఇంకా స్కూలింగ్‌ కూడా పూర్తి చేయలేదు. ప్రస్తుతం అతడు 10వ తరగతి విద్యార్ది. క్రికెట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు అతడు ఈ ఏడాది బోర్డు పరీక్షలను వాయిదా వేసుకున్నాడు. వైభవ్‌ ప్రస్తుతం దులీప్‌ ట్రోఫీలో పాల్గొంటున్నాడు. ఈ టోర్నీలో ఈస్ట్‌ జోన్‌ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. తాజాగా నార్త్‌ ఈస్ట్‌ జోన్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో బ్యాట్‌తో రాణించలేకపోయినా, బంతితో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అతడు 4 బంతుల వ్యవధిలో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 210 పరుగుల తేడాతో గెలుపొందిన ఈస్ట్‌ జోన్‌ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆగస్ట్‌ 30న మొదలయ్యే తొలి సెమీస్‌లో ఆ జట్టు సెంట్రల్‌ జోన్‌తో తలపడనుంది. చదవండి: టీ20 క్రికెట్‌లో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన నమీబియా నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) కొంచమైనా బుర్ర ఉందా...! సౌకర్యాలు లేకుండానే ఓపెన్ చేస్తే ఇలానే ఉంటుంది నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయ్.. సామాన్యుడికి షాక్! పెద్దమ్మతల్లి గుడిలో ఘోర సంఘటన.. పూజ చేయిస్తుండగా...! కొడుకు, అల్లుడి రాజకీయ రంగ ప్రవేశం.. రాచమల్లు కామెంట్స్

Original source: sakshi.com
Read more on Kaizer News