Shorts భద్రాచలం సెప్టెంబర్ 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల హడావిడి మొదలైంది. రెడ్ క్రాస్ సొసైటీ వచ్చిన ఆర్థిక సంవత్సరంలో అకౌంట్ ఇప్పటి వరకు ప్రజల ముందుఎందుకు పెట్టడం లేదని లెక్కలు అన్ని చెప్పిన తర్వాతనే ఈ యొక్క ఎన్నికలను నిర్వహించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ మునిగేల శివ ప్రశాంత్ డిమాండ్ చేశారు. రెడ్ క్రాస్ సొసైటీలో నూతనంగా సభ్యత్వం తీసుకున్న వారికి సొసైటీ నిబంధన ప్రకారం ఓటు హక్కు ఉంటుందా.. రెడ్ క్రాస్ సొసైటీ లో సభ్యత్వాలు అందరికీ తెలిసేలా ఎందుకు ప్రచారం చేయడం లేదు.. కొంతమంది స్వార్థం కోసం వారి సొంత ప్రయోజనాల కోసం రెడ్ క్రాస్ సొసైటీని ఉపయోగిస్తున్నారా అనే విషయంపై త్వరలోనే బయటపడతాయని అన్నారు. సొసైటీకి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అద్దెల నుండి వచ్చిన ఆర్థిక లావాదేవీలు ఎంత.. అసలు సొసైటీ ఎప్పుడు ఏర్పడింది అప్పటినుండి ఇప్పటివరకు ఎవరెవరు ఎంత ఇచ్చారు ఎంత ఖర్చు చేశారు. వాటికీ సంబంధించి ఆర్థిక లావాదేవీలను బహిర్గతం చేసే విధంగా ఒక కమిటీ వేసి తేల్చాలని శివ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, భద్రాచలం సబ్ కలెక్టర్ స్పందించాలని మునిగేల శివ ప్రశాంత్ కోరారు