Kaizer News

Kothagudem: మణుగూరులో రూ.6.80 లక్షల CMRF చెక్కుల ప

Kothagudem: మణుగూరులో రూ.6.80 లక్షల CMRF చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే పాయం

· State - Telangana · hmtvlive.com

Shorts భద్రాద్రి కొత్తగూడెం: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు లబ్ధిదారులకు అందజేశారు. మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం రూ.6 లక్షల 80 వేల రూపాయల విలువైన CMRF చెక్కులను మణుగూరు మండలానికి చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో వైద్య చికిత్స పొందుతున్న కుటుంబాలకు CMRF ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్, ముఖ్య నాయకులు పాతూరి వెంకన్న, అబ్దుల్లా, అప్పారావు, తిరుమలేష్, చింతల కృష్ణ, మహబూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News