Kaizer News

Motivational Story: కుక్క పని గాడిద చేస్తే ఏమవుతుం

Motivational Story: కుక్క పని గాడిద చేస్తే ఏమవుతుందో తెలుసా?.. మీ కళ్ళు తెరిపించే కథ కాదు.. జీవిత సత్యం..!

· State - Telangana · tv9telugu.com

ఒకరి పనిని మరొకరు అనాలోచితంగా భర్తీ చేయాలని చూస్తే ఎలాంటి ఫలితం ఎదురవుతుందో తెలియజేసే అద్భుతమైన కథ ఇది. అది అయోధ్యాపురి అనే ఒక అందమైన గ్రామం..ఆ ఊళ్లో వీరేశం అనే చాకలి నివసించేవాడు. అతడు తన వృత్తి పనినే చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిత్యం గ్రామస్తుల దుస్తులను సేకరించి చెరువు వద్దకు తీసుకెళ్లి ఉతకడానికి అతడు ఒక గాడిదను పెంచుకుంటున్నాడు. దాంతోపాటు ఇంటికి కాపలాగా ఉండేందుకు ఒక కుక్కను కూడా సాకుతున్నాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు గాడిద మూటల బరువు మోస్తూ కష్టపడటం చూసి, వీరేశం దానికి మంచి పోషకాహారం అందించేవాడు. కానీ, కుక్క కేవలం తిరుగుతూ ఉందనుకుని దానిని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఇదిలా ఉండగా, ఒక రోజు రాత్రి వీరేశం కుటుంబం గాఢ నిద్రలో ఉండగా, ఒక దొంగ ఇంట్లోకి దూరాడు.. కుక్క ఆ దొంగను గమనిస్తుంది. కానీ, మొరగకుండా ఊరుకుంటుంది. యజమాని తన శ్రమను, కాపలా కాసే బాధ్యతను గుర్తించనప్పుడు తాను ప్రాణాలకు తెగించి అరవడం వ్యర్థమని భావించింది. అయితే, ఇదంతా చూసిన గాడిద, దొంగ వచ్చినా నువ్వు ఎందుకు అరవడం లేదు? నేను అరిచి యజమానిని లేపుతాను అంటూ గట్టిగా ఒండ్రించడం మొదలుపెట్టింది. గాడిద అర్ధరాత్రి వేళ అకారణంగా అరుస్తోందని తీవ్ర కోపానికి గురైన వీరేశం, నిద్రలేచి కర్రతో గాడిదను చితకబాదాడు. ప్రశంసలు వస్తాయని ఆశించిన గాడిదకు తీవ్రమైన గాయాలు మిగిలాయి. ప్రతి వ్యక్తికి, ప్రతి ఉద్యోగికి వారిదే అయిన ప్రత్యేక స్థానం, బాధ్యత ఉంటుంది. ఇతరుల పాత్రను అనుకరించడం శ్రేయస్కరం కాదు. ఒక వ్యవస్థలో శారీరక కష్టంతో పాటు రక్షణ, ఆలోచన లాంటి మానసిక విధులకు కూడా సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఎవరి అర్హతకు తగ్గ పనిని వారే చేయాలి. అనవసరంగా ఇతరుల బాధ్యతల్లోకి వేలు పెడితే ప్రశంసలు దక్కకపోగా నిందలు, నష్టాలు భరించాల్సి వస్తుంది

Original source: tv9telugu.com
Read more on Kaizer News