రంపచోడవరం: పోలవరం జిల్లా, రంపచోడవరం లో శనివారం స్థానిక ఐటిడిఏ సమావేశపు హాల్లో వివిధ శాఖలకు సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై పోలవరం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ పోలవరం జిల్లాలో రహదారులు, తాగునీరు,భవనలు,విద్యుత్, విద్య, వైద్యం వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు తదితర మౌలిక వసతుల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, వంతెనల నిర్మాణం, తాగునీటి సౌకర్యాల కల్పన, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో అవసరమైన వసతుల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాలనీ ఆయన అన్నారు.పోలవరం జిల్లా లో భవన నిర్మాణ పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, పనుల పురోగతిని అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న మౌలిక వసతుల్లో లోపాలను గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం మరింత పెంచి, అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. నరేగా ద్వారా పనిచేసిన వివిధ అభివృద్ధి పనులకు బిల్లులు ఎప్పటికప్పుడు సబ్మిట్ చేయాలని ఆయన అన్నారు. మంజూరైన మెటల్ రోడ్లు వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన అన్నారు. ఒక్కొక్క ఇంజనీరింగ్ విభాగానికి మంజూరైన పనులను పూర్తి చేయుటకు ఎంత నిధులు అదనంగా కావాల్సి ఉన్నది నివేదికల సమర్పించాలని ఆయన అన్నారు. అంగన్వాడి భవనాలు డి ఏ జూగా ద్వారా మరుగుదొడ్లు తదితరవి పురోగతిని ఆయన ఆరా తీశారు. వివిధ రకాలైన అభివృద్ధి పనులు టార్గెట్ ప్రకారం పనులు పూర్తి చేయాలని ఆయన అన్నారు. మంజూరైన పనుల కాంట్రాక్టర్లు చేయుచున్న పనులకు నిర్ణీత గడువులోగా పూర్తి చేయని యెడల పెనాల్టీ వేయాలని ఆయన అన్నారు. పోలవరం జిల్లాలోని ఈఆర్ఎంఎస్ క్వార్టర్ పనులు ఏ విధంగా చేయుచున్నది ఆయన ఆరా తీశారు. సున్నంపాడు, నూరుపూడి రోడ్డు పనులపై ఆయన ఆరా తీశారు. గ్రామపంచాయతీ భవనాలు, హెల్త్ సెంటర్లు కొత్తవి ఏర్పాటు చేయుటకు నివేదికలు తయారు చేసి సమర్పించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. రబ్బర్ ప్రాసెసింగ్ స్మోకింగ్ రూములు ఏర్పాటు ఏ విధంగా చేయుచున్నది అదేవిధంగా పీఎం జన్మన్ పథకం ద్వారా మంజూరైన అభివృద్ధి పనులను ఏ విధంగా చేయుచున్నది ఆయన ఆయన తీశారు. పోలవరం జిల్లాలోని పీఎం జన్మన్ పథకం ద్వారా ఎన్ని గృహాలు మంజూరు అయినవి, ఇప్పటివరకు ఎన్ని గృహాలు పూర్తి చేసి ఉన్నది, ఇంకా ఎన్ని గృహాలు పూర్తి చేయవలసి ఉన్నది అదేవిధంగా కొత్తగా మంజూరైన గృహాలకు భూమి పూజ చేసి గృహాల పనులు ప్రారంభించాలని ఆయన అన్నారు. పోలవరం జిల్లాలోని వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన వివిధ ఇంజనీరింగ్ అధికారులు సుమారు 100 కోట్ల రూపాయలు మంజూరు చేయించుటకు నివేదికలు తయారుచేసి సమర్పించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ నర సింగారావు, ఈ