Kaizer News

Korean Kanakarju OTT : ఓటీటీలోకి రీసెంట్ హారర్ కామ

Korean Kanakarju OTT : ఓటీటీలోకి రీసెంట్ హారర్ కామెడీ - వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

· Entertainment · telugu.abplive.com

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ హారర్ కామెడీ డ్రామా కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించగా... ఆగస్ట్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకోగా... సెప్టెంబర్ 4 నుంచి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. మూవీలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే సత్య, వీటీవీ గణేశ్, సునీల్, మురళీధర్ గౌడ్, తులసి తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమన్ మ్యూజిక్ అందించగా... యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. టే? రాయలసీమ ప్రాంతం అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన యువకుడు కనకరాజు (వరుణ్ తేజ్). అతని స్నేహితుడు కిష్టప్పకు (సత్య) ఫోటో స్టూడియో ఉంటుంది. చెక్క భజన ప్రదర్శనలు ఇస్తూ, దాంతో వచ్చిన డబ్బుతో కుటుంబానికి అండగా ఉంటాడు. సంపాదించిన డబ్బును బ్యాంకులో వేయడం, సాయంత్రం ఫ్రెండ్ కిష్టప్పతో కలిగి బారులో మందు కొట్టడం, చెంగారెడ్డి (సునీల్) గ్యాంగ్‌తో గొడవలు ఇలా కాలం వెళ్లదీస్తుంటాడు. ఊరు పక్కనే ఉన్న కియా కార్ ఫ్యాక్టరీలో పని చేసే ఛైత్ర (రితికా నాయక్)ను చూసి ప్రేమలో పడతాడు. ఇద్దరికీ పరిచయం ఏర్పడుతుంది. ఆమె కొరియాలో సెటిల్ అవ్వాలని చూస్తుంటుంది. ఇంతలో కొరియా నుంచి వచ్చిన ఓ వస్తువు నుంచి ఓ ఆత్మ కనకరాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పటి నుంచి అతని చూపులు, చేష్టలు భయంకరంగా మారతాయి. అసలు ఆ ఆత్మ కోరికల్ని తెలుసుకున్న కనకరాజు తన స్నేహితుడితో కలిసి కొరియా వెళ్తాడు. ఇంతకూ ఆ ఆత్మ ఎవరిది? కనకరాజు కొరియా వెళ్లాక అక్కడ ఏం జరిగింది? ఆ ఆత్మ నుంచి కనకరాజుకు విముక్తి ఎలా లభించింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. .. ఆ ఓటీటీలో డోంట్ మిస్ NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. Up Next Up Next Up Next Up Next ఇరుముడి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే? హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ హైదరాబాద్ మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది ప్రపంచం నేపాల్ వరద: 626 మంది మృతి.. ఇంకా 2400 మంది గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ నిజామాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏ కేం

Original source: telugu.abplive.com
Read more on Kaizer News