Visakhapatnam: మారికవలస బాలికలు గురుకులంలో తీవ్ర ఉద్రిక్తత, విశాఖ ఆర్డిఓ దిలీప్ చక్రవర్తిని అడ్డుకున్న ప్రజా సంఘాలు, పోలీసులు సాయంతో ఆందోళనకారులను తప్పించుకొని పరుగులు తీసిన ఆర్డిఓ.మారికవలస గిరిజన గురుకుల బాలికలు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సు లో క్యాంపస్ లో ఆదివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మారికవలస గిరిజన గురుకుల ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులను అక్కడే చదువుకొని ఇవ్వాలని సమస్యను పరిష్కారం చేసేంతవరకు బయటకు వెళ్ళనివ్వమని విశాఖ సిటీ ఆర్ డి ఓ దిలీప్ చక్రవర్తి ని విద్యార్థులు, వారి తల్లి తండ్రులు ప్రజా సంఘాల నాయకులు అడ్డుకున్నారు దీంతో పోలీసులు ఆందోళనకారుల మధ్య తోపులాటలు తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు సాయంతో గేటు బయటకు వెళ్లి పరుగులు తీసిన ఆర్డీవో. పోలీసులు తీరుపై మండిపడ్డ ప్రజాసంఘాలు విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’