అటవీ భూముల్లో రెవెన్యూ శాఖ జోక్యం చేసుకోరాదని హైకోర్టు హెచ్చరించింది. అటవీ శాఖ పరిధిలోని వ్యవహారాల్లో రెవెన్యూ శాఖ జోక్యం ఎకువ అవుతున్నదని, ఇది సరికాదని తేల్చి చెప్పింది. ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రి ఒత్తిడి తెస్తున్నారంటూ పట్టాలిస్తే అంగీకరించబోమని స్పష్టంచేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం రాజారాం గ్రామంలో అటవీ శాఖ అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారంటూ ఎం విట్టల్ విట్టు మరో 8 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు