కన్నెపల్లి, ఆంధ్రప్రభ : భీమిని మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, దివంగత పంతంగి ప్రమోద్‌గౌడ్ కుటుంబాన్ని టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి ఆదివారం పరామర్శించారు. గత నెల బైక్ ప్రమాదానికి గురై అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ప్రమోద్‌గౌడ్ ఈ నెల 12న మృతిచెందారు. మండలం లోని వడాల్ గ్రామంలోని ఆయన నివాసంలో ఆదివారం నిర్వహించిన సంతాప సభ కు హాజరైన నాతరి స్వామి. ప్రమోద్‌గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసినివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమోద్గౌడ్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మండల వైస్ చైర్మన్ గడ్డం మహేందర్‌గౌడ్, సీనియర్ నాయకులు బ్రహ్మయ్య, బండి లక్ష్మణ్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు