Kaizer News

AI: వార్తలకు ఏఐ సాయం తీసుకున్నా బాధ్యత జర్నలిస్టుద

AI: వార్తలకు ఏఐ సాయం తీసుకున్నా బాధ్యత జర్నలిస్టుదే.. ఏఐపై నెట్టేయలేరు: సీనియర్ జర్నలిస్టు సుధాకర్ రెడ్డి

· State - Telangana · tv9telugu.com

హైదరాబాద్: జర్నలిస్టులు తమ విధుల్లో భాగంగా కృత్రిమ మేధను (ఏఐ) వినియోగించవచ్చు… అయితే దాని సాయంతో రూపొందించిన వార్తల విశ్వసనీయత బాధ్యత మాత్రం ఏఐపై నెట్టేయలేరని సీనియర్ జర్నలిస్టు సుధాకర్ రెడ్డి ఉడుముల అన్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన ఏఐ ప్రొవెనెన్స్ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్, డేటాలీడ్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ శిక్షణకు సుమారు 70 మంది జర్నలిస్టులు హాజరయ్యారు. వార్తా రచనలో ఏఐని బాధ్యతాయుతంగా ఉపయోగించడం, సరైన ప్రాంప్ట్‌లు ఇవ్వడం, సమాచారాన్ని నిర్ధారించడం, మూలాలను రక్షించడం, డిజిటల్ కంటెంట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునే సాధనాలపై శిక్షణ ఇచ్చారు. సుధాకర్ రెడ్డి ఉడుముల ‘జర్నలిజంలో ఏఐకి 12 నియమాలు’ అనే అంశాన్ని వివరించారు. వాటన్నింటికంటే బాధ్యతకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ‘‘ఏఐ ఒక సహాయకుడు మాత్రమే. జర్నలిస్టు కాదు. మానవ జర్నలిజానికి అది తోడ్పడాలి తప్ప జర్నలిస్టు విచక్షణను భర్తీ చేయకూడదు’’ అని చెప్పారు. ఏఐ కల్పించే తప్పుడు వాస్తవాలు, లేని మూలాలను చూపించడం, పక్షపాతం, పాత సమాచారం, లెక్కల్లో తప్పులు, తప్పు సమాచారంపైనా అధిక నమ్మకం చూపడం వంటి ప్రమాదాలపై శిక్షణలో ప్రధానంగా చర్చించారు. ప్రతి ఏఐ మోడల్‌కు ఉన్న పరిమితులను జర్నలిస్టులు తెలుసుకోవాలని సూచించారు. అది ఏ సమాచారాన్ని పొందగలదు, అందులోని సమాచారం ఎంత తాజాది, ఏ పనుల్లో దాని పనితీరు నమ్మదగనిదిగా ఉండొచ్చు వంటి అంశాలను ముందుగానే అర్థం చేసుకోవాలని తెలిపారు. నిర్ధారించిన సమాచారం లేకుండా ఏఐని వార్త తయారు చేయమని అడగకూడదని శిక్షణలో సూచించారు. రిపోర్టింగ్ ద్వారా సేకరించిన సమాచారం, పత్రాలు, డేటాసెట్లు, స్పష్టంగా పేర్కొన్న మూలాల ఆధారంగానే ఏఐని ఉపయోగించాలని తెలిపారు. ఏఐ రూపొందించిన పేర్లు, సంఖ్యలు, తేదీలు, వ్యాఖ్యలు, వాదనలు, మూలాలు, నిర్ధారణలను జర్నలిస్టు స్వతంత్రంగా తనిఖీ చేయాలని చెప్పారు. తుది నిర్ధారణ బాధ్యత జర్నలిస్టుదేనని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: Gold Price: సెప్టెంబర్‌లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే..! ఏఐని సమాచార మూలంగా భావించకూడదని, దాన్ని ఆధారంగా ఎప్పుడూ చూపకూడదని శిక్షణలో వివరించారు. వార్తలోని ప్రతి కీలక అంశాన్ని అసలు పత్రం, సంబంధిత వ్యక్తి, డేటాసెట్, తీర్పు, ప్రభుత్వ నివేదిక, పరిశోధన పత్రం, పత్రికా ప్రకటన లేదా అధికారిక రికార్డు వరకు వెనక్కి వెళ్లి నిర్ధారించాలని సూచించారు. ఒక వ్యక్తి చెప్పని మాటలను ఏఐతో సృష్టించి అతని వ్యాఖ్యలుగా చూపకూడదని హెచ్చరించారు. ఆధారాలు ఏం చెబుతున్నాయి, ఏఐ ఏం లెక్కించింది, మోడల్ ఏం ఊహించింది అనే తేడాను జర్నలిస్టులు స్పష్టంగా గుర్తించాలని చెప్పారు. ఏఐ రూపొందించిన శాతాలు, ర్యాంకింగులు, పోలికలను ప్రచురించే ముందు మళ్లీ స్వతంత్రంగా లెక్కించాలని సూచించారు. పరిశోధనాత్మక కథనాలు, క్లిష్టమైన వార్తల విషయంలో వేగంగా పనిచేస్తుందనో, తక్కువ ఖర్చుతో దొరుకుతుందనో, ఎక్కువ మంది వాడుతున్నారనో ఏదో ఒక మోడల్‌ను ఎంచుకోవద్దని సూచించారు. అవసరాన్ని బట్టి రీజనింగ్, పరిశోధన, కో

Original source: tv9telugu.com
Read more on Kaizer News