కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు.. ఆలయ మర్యాదలతో స్వాగతం ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న పోలీస్ కమిషనర్ కుటుంబ సభ్యులకు దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) పోలీస్ కమిషనర్ దంపతులకు శ్రీ కనకదుర్గమ్మవారి చిత్రపటంతో పాటు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు