Kaizer News

ఉత్తనూర్ లో నీళ్ల కోసం నిరసన..

ఉత్తనూర్ లో నీళ్ల కోసం నిరసన..

· State - Telangana · prabhanews.com

సదాశివనగర్, ఆంధ్రప్రభ : సదాశివనగర్ మండలంలోని ఉత్తునూర్ గ్రామంలో నీళ్ల కోసం గ్రామస్తులు ఆదివారం నిరసన తెలిపారు. గ్రామంలోని 6.7వ వార్డులలో నీటి సమస్య తీవ్రంగా ఉందని శివాజీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో నీటి సమస్యతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నమని తెలిపారు. ఎన్నికల సందర్భంగా గ్రామంలో నీటి సమస్యను పరిష్కరిస్తామని ఓట్ల కోసం హామీ ఇస్తున్నారని, ఎన్నికలలో గెలిచిన తర్వాత ఇచ్చిన మాటను మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీళ్లనే తాగటానికి,ఇతర అవసరాలకు వాడుకుంటున్నామని తెలిపారు. ఏదైనా సమస్యతో మిషన్ భగీరథ నీళ్ల సరఫరా నిలిచిపోతే వ్యవసాయ బోరుబావుల నుండి నీళ్లను తెచ్చుకుంటున్నామని అన్నారు. ఉన్నత అధికారులు స్పందించి గ్రామంలో త్రాగు నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News