Kaizer News

Eluru: వాయు కాలుష్య నియంత్రణకు పక్కా ప్రణాళికలు

Eluru: వాయు కాలుష్య నియంత్రణకు పక్కా ప్రణాళికలు

· State - Telangana · hmtvlive.com

Shorts ఏలూరు: ఏలూరు నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను పక్కాగా అమలు చేయాలని ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో ఆయన అధ్యక్షతన ‘నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్’ (NCAP) జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ హాట్‌స్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని,కాలుష్యానికి దారితీస్తున్న కారణాలను గుర్తించి,క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా హాట్‌స్పాట్ ప్రాంతాలలో కాలుష్య నియంత్రణకు నిర్దిష్ట చర్యలు చేపట్టాలి అని యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR) కాలుష్య నియంత్రణ నోటీసులు జారీ చేసిన పరిశ్రమలు,సంస్థల నుండి రాతపూర్వకమైన యాక్షన్ టేకెన్ రిపోర్టులను సేకరించి తదుపరి సమీక్షకు అందజేయాలి. వాహనాలపై నిఘా పెట్టి ఇసుక,ఇతర సరుకు రవాణా చేసే ఓవర్‌లోడ్ వాహనాల వల్ల దుమ్ము, కాలుష్యం పెరుగుతోంది అని ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచి,కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలి అని డీజిల్,పెట్రోల్ వాహనాల వినియోగాన్ని తగ్గించి ఈ-ఆటోలు,ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) ప్రోత్సహించాలి. అని డీజిల్ ఆటోలను సిఎన్‌జి (CNG) వాహనాలుగా మార్చేందుకు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించాలి అని వాయు కాలుష్యంతో పాటు విజువల్ పొల్యూషన్ నియంత్రణకు కూడా ప్రణాళికలో చర్యలు చేర్చాలి అని తెలిపారు.ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఏ.భానుప్రతాప్,కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ఏ.రామచంద్రమూర్తి,జిల్లా రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారి ఎస్.బి.శేఖర్, సిపిసిబి కన్సల్టెంట్ ఏ.కోమలితో పాటు రవాణా, పోలీసు,వ్యవసాయ,అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News