ఆరు నూరైనా.. వెనక్కి తగ్గం!.. అసెంబ్లీలో చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయి.. Minister Ponguleti Srinivasa Reddy Press Meet | హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో : అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలో జరిగిన భూ అక్రమాలపై ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ‘‘ఆరు నూరైనా భూ దురాక్రమణలపై చర్యలు తీసుకుంటాం’’ అని తేల్చి చెప్పారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ప్రైవేట్ భూముల విషయంలో పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తామని తెలిపారు. భూముల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలంటే రెవెన్యూ రికార్డులు, డాక్యుమెంట్లు, క్షేత్రస్థాయి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. రికార్డుల్లో ఎంత భూమి ఉంది? డాక్యుమెంట్లలో ఎంత చూపించారు? ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఎంత ఉంది? ప్రభుత్వ భూమి ఎంత? అసైన్డ్ భూమి ఎంత? అనే అంశాలను సర్వే ద్వారా నిర్ధారిస్తామని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మంత్రి పొంగులేటి పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తాను చేస్తున్న ఆరోపణలకు పూర్తి ఆధారాలు, అధికారిక రికార్డులు ఉన్నాయని చెప్పారు. విచారణ పూర్తయిన తర్వాత అన్ని విషయాలు స్పష్టమవుతాయని తెలిపారు. భూముల విషయంలో ప్రభుత్వం ఎవరినీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టదని, అయితే ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ప్రైవేట్ పట్టా భూములు, భౌతిక స్వాధీనం, రెవెన్యూ రికార్డులు, ఎన్నికల అఫిడవిట్లలో చూపిన ఆస్తుల మధ్య వ్యత్యాసాలు ఉంటే వాటిని చట్ట ప్రకారం పరిశీలించాల్సిందేనని స్పష్టం చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లోని భూములపై వచ్చిన ఫిర్యాదులు, స్థానికుల నుంచి అందిన సమాచారాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు కూడా అందిన సమాచార ఆధారంగానే ఉన్నాయని చెప్పారు. ఫామ్‌హౌస్ పరిసరాల్లో ప్రభుత్వ భూములు ఉన్నట్లు సర్వేలో తేలితే, వాటిని చట్ట ప్రకారం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని అర్హులైన పేదలకు, ముఖ్యంగా దళితులకు ఉపయోగించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో వ్యవసాయ భూములు లేవని పేర్కొన్న తర్వాత భారీగా భూములు ఎలా వచ్చాయన్న అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉందని మంత్రి అన్నారు. ఎన్నికల అఫిడవిట్లు, ప్రస్తుతం ఉన్న భూముల వివరాల మధ్య వ్యత్యాసాలపై రికార్డుల ఆధారంగా విచారణ జరుగుతుందని తెలిపారు. కేటీఆర్ కుమారుడి పేరుతో ఉన్న 40 ఎకరాల భూమి అంశంపైనా మంత్రి స్పందించారు. చిన్న వయసులోనే అంత పెద్ద మొత్తంలో భూమి ఎలా వచ్చిందన్న విషయంపై రికార్డుల ఆధారంగా పరిశీలన జరగాల్సి ఉందన్నారు. హరీశ్‌రావు ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన భూములు, ప్రస్తుతం ఉన్న భూములు, భౌతిక స్వాధీనం, ట్రస్టుల పేరుతో ఉన్న ఆస్తుల వివరాలను కూడా పరిశీలిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. అఫిడవిట్‌లో ఎంత చూపించారు? రికార్డుల్లో ఎంత ఉంది? ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఎంత ఉంది? బినామీ పేర్లతో ఏమైనా ఉన్నాయా? అనే అంశాలు అధికారిక పత్రాల ద్