Shorts అమరావతి: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తుగా సిద్ధం చేసిన యాక్షన్ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాదని.. అన్ని వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, ఆర్ఎస్‌కే సిబ్బందితో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం పలు అంశాలపై సమీక్షించారు. ఎల్‌నినో పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకున్నామని చంద్రబాబు తెలిపారు. ముందుగా సిద్ధం చేసుకున్న కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల రైతులు ఇబ్బందులు పడకుండా చూడటంతో పాటు.. వినియోగదారులపై కూడా భారం పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విపత్తులు వచ్చినప్పుడు వాటి ప్రభావం ప్రజలపై పడకుండా చూడటం ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలని సీఎం సూచించారు. ఇప్పటికే పంటల బీమా చేయించామని.. పంట నష్టం సంభవిస్తే బీమా పరిహారం రైతులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను పరిశీలించాలని చెప్పారు. మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగును ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు. పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, వర్షాభావాన్ని తట్టుకునే పంటల సాగును పెంచడంతో పాటు డిమాండ్ ఎక్కువగా ఉన్న పంటలను సాగు చేసేలా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. సంప్రదాయేతర ప్రాంతాల్లో కూడా ఉల్లి, మిరప సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో పంటల ఉత్పత్తి తగ్గితే నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను అదుపులో ఉంచాలని సూచించారు. గోడౌన్లలో ఉన్న బియ్యం నిల్వలను పరిశీలించి.. అవసరమైన మేరకు మార్కెట్‌లోకి విడుదల చేసే చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఉల్లి ధరలను నియంత్రించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తున్నామని సీఎం తెలిపారు. భవిష్యత్‌లో ఉల్లికి ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా సాగును ప్రోత్సహించాలని సూచించారు. సంప్రదాయేతర ప్రాంతాల్లోనూ ఉల్లి సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కూరగాయల ధరలను నియంత్రించేందుకు కిచెన్ గార్డెన్లను ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్ల ద్వారా కూరగాయలను పండించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విధానాన్ని వ్యవస్థీకృతంగా అమలు చేయగలిగితే కూరగాయల ధరలను కొంతమేర నియంత్రించవచ్చన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటలపై ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సీఎం తెలిపారు. హైరిస్క్ ప్రాంతాల్లో ఉద్యాన పంటలను కాపాడేందుకు ప్రభుత్వం రూ.190 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించి రైతులకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవ