Kaizer News

కమీషన్ల ‘టవర్‌’!

కమీషన్ల ‘టవర్‌’!

· State - Telangana · sakshi.com

శాశ్వత సచివాలయం ఎంఈపీ, హెచ్‌వీఏసీ, ఫైర్, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌ల టెండర్లలో గోల్‌మాల్‌ మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్‌ పనుల్లో రూ.783 కోట్ల దోపిడీకి స్కెచ్‌ రూ.2,183.84 కోట్ల అంచనా వ్యయంతో వేర్వేరుగా టెండర్‌ నోటిఫికేషన్‌ చదరపు అడుగుకు రూ.4,183.20 చొప్పున వ్యయం.. అత్యాధునిక టెక్నాలజీ వాడినా చ.అ.కు రూ.2,500 మించదంటున్న ఇంజినీరింగ్‌ నిపుణులు టెండర్లలో జాయింట్‌ వెంచర్లు పాల్గొనేందుకు అర్హత లేదంటూ నిబంధన పనులు దక్కించుకున్నాక 50% సబ్‌ కాంట్రాక్టర్‌కు ఇచ్చుకునే వెసులుబాటు ఇదంతా ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు ఇవ్వడానికేనంటున్న ఇంజినీర్లు సాక్షి, అమరావతి: అమరావతిలో శాశ్వత సచివాలయం టవర్లకు ఎంఈపీ (మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్‌), హెచ్‌వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్‌లు, ఫైర్‌ అలారమ్‌ తదితరాల పనులకు ఏకంగా రూ.2,183.84 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలవడంపై ఇంజినీరింగ్‌ నిపుణులు నివ్వెరపోతున్నారు. కేవలం ఐదు టవర్లలో అంతర్గత పనులకే ఈ స్థాయిలో వ్యయం చేస్తుండటంపై తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు టవర్లను బీ+జీ+39.. జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మిస్తున్నారు. ఒక్కో అంతస్తు 47 మీటర్ల వెడల్పు, 47 మీ. పొడవుతో 2,209 చ.మీ. నిర్మిత ప్రాంతంతో నిర్మిస్తున్నారు. మొత్తం ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4.85 లక్షల చదరపు మీటర్లు.. అంటే 52,20,496 చ.అడుగులు. అంటే.. ఎంఈపీ, హెచ్‌వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్‌లు లాంటి పనులకే చదరపు అడుగుకు రూ.4,183.20 చొప్పున వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ పనులకు అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి టెండర్లు పిలిచారని.. ఎక్కువ కమీషన్‌ ఇచ్చే కాంట్రాక్టర్‌కు అప్పగించి.. భారీ ఎత్తున దోచుకోవడానికి ముఖ్యనేత స్కెచ్‌ వేశారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. శాశ్వత సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనుల టెండర్లలో జాయింట్‌ వెంచర్లలు పాల్గొనటానికి అర్హత లేదని ఏజీఐసీఎల్‌ పెట్టిన నిబంధన టెండర్లలో పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్‌ సంస్థ ఆ పనుల విలువలో 50 శాతం వరకు సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు వెసులుబాటు కల్పిస్తూ పెట్టిన నిబంధన మూడు ప్యాకేజీలుగా.. రాజధాని ప్రాంతంలో నేలపాడు వద్ద శాశ్వత సచి­వాలయాన్ని 900 మీ. పొడవు, 139 మీ. వెడల్పుతో 32 ఎకరాల విస్తీర్ణంలో పాలవాగుకు ఉత్తరాన 2 టవర్లు, దక్షిణాన మూడు టవర్లుతో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ఐదు టవర్లకు హై సైడ్‌ ఎలక్ట్రికల్‌ (విద్యుత్‌ సరఫరా), హెచ్‌వీఏసీ(వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ), అగ్నిమాపక వ్య­వ­స్థ, లిఫ్ట్‌లు, ప్లంబింగ్‌ పనులు చేపట్టేందుకు మూ­డు ప్యాకేజీల కింద ఏజీఐసీఎల్‌ (అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌) టెండర్లు పిలిచింది. 1, 2 టవర్లకు రూ.737.76 కోట్లు (రూ.134.68 కోట్లు అదనంగా సీనరేజీ లాంటి పన్నుల రూపంలో రీయింబర్స్‌).. 2, 3 టవర్లకు రూ.679.19 కోట్లు (రూ.123.92 కోట్లు పన్నుల రూపంలో అదనంగా రీయింబర్స్‌).. జీఏడీ టవర్‌కు రూ.429.83 కోట్లు (రూ.78.46 కోట్లు పన్నుల రూపంలో అదనంగా రీయింబర్స్‌) అంచనా వ్యయంతో 18 నెలల్లో పనులు పూర్తి చేసి.. మరో రెండేళ్లపాటు నిర్వహించాలనే షరతుతో టెండ

Original source: sakshi.com
Read more on Kaizer News