Kaizer News

21 మంది విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ..

21 మంది విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ..

· State - Telangana · prabhanews.com

లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండలంలోని జెడ్పీహెచ్ఎస్ లక్ష్మణచాంద, బాబాపూర్ పాఠశాలల విద్యార్థినులకు వరల్డ్ విజన్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం సైకిళ్లు పంపిణీ చేశారు.తిరుపల్లి గ్రామం నుంచి లక్ష్మణచాంద జెడ్పీహెచ్ఎస్ కు వచ్చే 10 మంది విద్యార్థినులకు, కంజర గ్రామం నుంచి బాబాపూర్ జెడ్పీహెచ్ఎస్ కు వచ్చే 11 మంది విద్యార్థినులకు కలిపి మొత్తం 21 సైకిళ్లను అందజేశారు. ఒక్కో సైకిల్ విలువ రూ. 5,600 చొప్పున మొత్తం రూ. 1,17,600 విలువ గల సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ విజన్ సంస్థ కోఆర్డినేటర్ అంబేద్కర్, ప్రోగ్రాం ఆఫీసర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ విద్యార్థినుల చదువు మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే సైకిళ్లు అందజేస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఓస కవిత రాజు, తిరుపల్లి సర్పంచ్ బొమ్మెన గిరిజ రవి, మాజీ జెడ్పీటీసీ ఓస రాజేశ్వర్, వీడీసీ మాజీ అధ్యక్షులు రామ్ రెడ్డి, ఉప సర్పంచులు రవి, ప్రవీణ్, వార్డు మెంబర్లు రంజిత్, ప్రభాకర్, బాబాపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు నగేష్, లక్ష్మణచాంద పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News