Kaizer News

ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

· State - Telangana · prabhanews.com

మైలవరం, ఆంధ్రప్రభ) : ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలం పుల్లూరు గ్రామంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దాసుడుపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు (35)ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యుల కోసం పుల్లూరు సెంటర్‌లో మాంసం కొనుగోలు చేసుకుని వెంకటేశ్వరరావు ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తున్నట్లు సమాచారం. కొంతదూరం వెళ్లిన తర్వాత మాంసం సరిపోదని భావించి మళ్లీ పుల్లూరు సెంటర్‌కు వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన మృతి చెందినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న మైలవరం ఎస్‌ఐ సుధాకర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది

Original source: prabhanews.com
Read more on Kaizer News