Kaizer News

IND VS SL - Asian Games Final: ఇండియా వ‌ర్సెస్ లంక

IND VS SL - Asian Games Final: ఇండియా వ‌ర్సెస్ లంక ఫైన‌ల్ పోరు.. సెమీస్ లో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. మంధాన వరల్డ్ రికార్డ్

· National - India · telugu.abplive.com

ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ పోటీల్లో భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఫైనల్ సమరానికి దూసుకెళ్లింది. ఫైనల్లో శ్రీలంక‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధ‌మైంది. ఆదివారం జరిగిన రెండో సెమీఫైనల్ పోరులో బంగ్లాదేశ్‌ను 114 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో పరుగుల పరంగా భారత మహిళల జట్టుకు ఇది మూడో అతిపెద్ద విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ ఓపెనర్ షఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా విరుచుకుపడి తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేసింది. 2019లో అరంగేట్రం చేసిన 22 ఏళ్ల ఈ డాషింగ్ బ్యాటర్, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సెంచరీ పూర్తి చేసుకుని ఈ టోర్నమెంట్ చరిత్రలోనే తొలి శతకం బాదిన మహిళా క్రీడాకారిణిగా సరికొత్త చరిత్ర సృష్టించింది. 49 బంతుల్లో 9 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో బంగ్లా బౌలర్లను ఊచకోత కోసింది. అనంత‌రం భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన బంగ్లా.. 15.4 ఓవ‌ర్ల‌లోనే 81 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. ఓపెన‌ర్ దిలారా అక్త‌ర్ (27) టాప్ స్కోర‌ర్ గా నిలిచింది. బౌల‌ర్ల‌లో నంద‌ని శ‌ర్మ, దీప్తి శ‌ర్మ‌ మూడు వికెట్ల‌తో అద‌ర‌గొట్టారు. సుజీ బేట్స్ రికార్డు బద్దలు.. అగ్రస్థానంలో స్మృతి మంధాన ఇక ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన భార‌త్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన కేవలం 37 పరుగులకే నిష్క్రమించినప్పటికీ ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సుజీ బేట్స్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును అధిగమించి, మహిళల టీ20 క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ లీడింగ్ రన్‌స్కోరర్‌ (4,788 పరుగులు)గా నయా చరిత్ర లిఖించింది. మరోవైపు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ధాటిగా ఆడుతూ 40 పరుగులు చేసి స్టంప్ ఔట్ కావడంతో కేవలం 10 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. భారత బ్యాటర్ల సమష్టి జోరుతో జట్టు భారీ టోటల్‌ను నిర్మించింది. పేకమేడలా కూలిన బంగ్లాదేశ్.. 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. పవర్‌ప్లే ముగిసే సమయానికి కేవలం 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. దిలారా మిన‌హా మిగిలిన బ్యాటర్లు క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయారు. భారత బౌలర్లలో శ్రీ చ‌ర‌ణికి రెండు వికెట్లు ద‌క్కాయి.. వారికి తోడుగా క్రాంతి గౌడ్, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ పడగొట్టారు. ఫైనల్లో శ్రీలంకతో సమరం.. పాక్ బంగ్లా బ్రాంజ్ ఫైట్ మంగళవారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో గోల్డ్ మెడల్ కోసం శ్రీలంకతో భారత్ తలపడనుంది. గత ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి ట్రోఫీ గెలిచిన భారత్, మరోసారి పసిడి పోరుకు సిద్ధమవుతోంది. ఇక 2022 ఎడిష‌న్ లోనూ లంక‌నే ఓడించి, స్వ‌ర్ణ ప‌త‌కం పొందిన భార‌త్, ఈ సారి కూడా ఆ ఫీట్ రిపీట్ చేయాల‌ని భావిస్తోంది. మొదటి సెమీఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక ఫైనల్ చేరింది. కాగా కాంస్య పతకం కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. (IST) Tags : Harmanpreet

Original source: telugu.abplive.com
Read more on Kaizer News