పద్మారావునగర్, వెలుగు: క్లీన్ కంటోన్మెంట్‌తోపాటు ఫిట్ కంటోన్మెంట్‌ను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. ఆల్ ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 35 ఏండ్లు పైబడిన వారికి సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో ఆదివారం మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్ నిర్వహించారు. చీఫ్ గెస్ట్‌గా హాజరై వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ చాటిన విజేతలకు మెడల్స్, బహుమతులు అందజేశారు. మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు మర్రి లక్ష్మణ్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి, ట్రెజరర్ శ్రీలక్ష్మి, బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ పాల్గొన్నారు