Kaizer News

Kurnool: గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు - ట్రాఫ

Kurnool: గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు - ట్రాఫిక్ మళ్లింపు

· State - Telangana · hmtvlive.com

Shorts కర్నూలు: కర్నూలులో సుమారు 1,500 గణేష్ విగ్రహాల నిమజ్జనం సంధర్భంగా (మంగళవారం) సెప్టెంబర్ 22 న జిల్లా పోలీసుశాఖ కట్టుదిట్టమైన భారీ భద్రతా చర్యలు చేపట్టిందని, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు ఆదివారం తెలిపారు. బందోబస్తు విధులలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 16 మంది డిఎస్పీలు, 85 మంది సిఐలు మరియు ఆర్ ఐలు , 150 మంది ఎస్సైలు, మొత్తం 2 వేల మంది పోలీసులను మోహరింపజేశామన్నారు. ఎవరికీ అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ గారు జిల్లా ప్రజలకు , గణేష్ ఉత్సవ విగ్రహా నిర్వహకులకు ఈ క్రింది సూచనలు, సలహాలు తెలియజేశారు. * విగ్రహాల నిర్వహకులు సమయపాలన పాటిస్తూ విగ్రహాల ఊరేగింపుకు అవసరమైన వాహానాలను, క్రేన్ల ను సిధ్దంగా ఉంచుకోవాలన్నారు. * విగ్రహాల ఊరేగింపు వాహనాల పై చిన్నపిల్లలు ఉండకుండా ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవాలన్నారు. * నిమజ్జన సమయంలో ఘాట్ల వద్ద , ఈత రాని వారిని, చిన్న పిల్లలు, మహిళలను దూరంగా ఉంచాలన్నారు. * ఊరేగింపులో వినాయక విగ్రహాలు తరలించే సమయంలో కరెంటు తీగలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. * అల్లరి మూకల పై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. * హోరెత్తించే డిజేలతో యువత మద్యం సేవించి అత్యుత్సాహం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. * ఎవరైనా మద్యం అనధికారికంగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకూడదన్నారు. * బాంబు డిస్పోజబుల్, డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృత తనిఖీలు చేస్తున్నామన్నారు. * అనుమానిత వస్తువులు గాని, వ్యక్తులు గాని తారసపడితే డయల్ 112 లేదా డయల్ 100 కు గాని, స్ధానిక పోలీసులకు గాని ప్రజలు సమాచారం అందించాలన్నారు. నిమజ్జనం సంధర్బంగా సెప్టెంబర్ 22 న కర్నూలు నగరంలో ట్రాఫిక్ మళ్ళింపు వాహనచోదకులు, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహాకరించాలన్నారు. గణేష్ నిమజ్జనం సంధర్బంగా సెప్టెంబర్ 22 వ తేది మంగళవారం ఉదయం 10 గంటల నుంచి గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు నగరంలో ట్రాఫిక్ ను మళ్లించినట్లు కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు తెలిపారు. అత్యవసర ( 108, ఫైర్ , అంబులెన్సులు, పోలీసు వాహనాలు) సేవల కోసం పోలీసు వారితో అనుమతి పొందిన వాహనాలు మాత్రమే నిమజ్జన మార్గంలో అనుమతిస్తారు. 1) కర్నూలు ఆర్టీసి బస్టాండ్ నుండి రాజ్ విహార్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్, వినాయక్ ఘాట్, గాయత్రి ఎస్టేట్ వరకు ఎటువంటి వాహనాలకు అనుమతి ఉండదు. వాహనాల రాక, పోకల నిషేధం ఉంటుంది. 2) కర్నూలు ఆర్టీసి బస్టాండ్ నుండి ఆర్టీసి బస్సులు, ఇతర వాహనాలను బళ్ళారి చౌరస్తా మీదుగా కల్లూరు చెన్నమ్మ సర్కిల్, గుత్తి పెట్రోల్ బంక్ , బిర్లా జంక్షన్ , మద్దూర్ నగర్ సర్కిల్ , సి. క్యాంపు మీదుగా నంద్యాల చెక్ పోస్టు వైపు వాహనాల రాక, పోకలు ఉంటాయి. 3) ఆత్మకూరు, నంద్యాల, నందికోట్కూరు, నంద్యాల చెక్ పోస్టు వైపు నుండి నగరంలోనికి వచ్చే వాహనాలు సి. క్యాంపు, బిర్లాగేట్ , గుత్తి పెట్రోల్ బంక్ నుండి కల్లూరు చెన్నమ్మ స

Original source: hmtvlive.com
Read more on Kaizer News