Shorts Uppada: అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు నిర్మించడం మాత్రమే కాదు.. ఆపదలో ఉన్న మనిషికి అండగా నిలవడం కూడా ప్రజాసేవలో భాగమేనని చాటిచెబుతూ ఉప్పాడ( జీవీకే) గంటా.విజయ్‌కుమార్ ముందుకు సాగుతున్నారు. సెప్టెంబర్ 17న తునిలో జరిగిన పెళ్లి బృందం రోడ్డు ప్రమాదంలో గాయపడి కాకినాడలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను( జీవీకే) గంటా.విజయ్‌కుమార్ పరామర్శించారు. ఆసుపత్రులకు స్వయంగా వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అవసరమైన వైద్య ఖర్చులకు తనవంతుగా ఆర్థిక సహాయం అందించి, “సుఖాల్లోనే కాదు కష్టాల్లో కూడా మీకు అండగా ఉంటాను” అంటూ భరోసా కల్పించారు. “పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో మేము ఆయన వెనకాల ఉండి పనిచేస్తున్నాం. ఆయన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కష్టం వచ్చిన కుటుంబం దగ్గరకు వెళ్లి అండగా నిలవాలి, ప్రజల కష్టాల్లో తోడుగా ఉండాలి అనేదే మా నాయకుడు పవన్ కళ్యాణ్ మాకు చూపించిన మార్గం” అని( జీవీకే) గంటా.విజయ్‌కుమార్ పేర్కొన్నారు. అవసరమైన ప్రభుత్వ, పార్టీ సంక్షేమ పథకాలు బాధితులకు అందేలా తనవంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాజకీయాలు, వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా ఆపదలో ఉన్న కుటుంబం దగ్గరకు వెళ్లి అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు మాట్లాడుతూ అవసరం ఉన్నప్పుడు మాత్రమే పలకరించే వారు చాలామంది ఉంటారని, కానీ ఆపద సమయంలో స్వయంగా ఆసుపత్రికి వచ్చి పరామర్శించి ఆర్థికంగా అండగా నిలిచిన( జీవీకే )గంటా.విజయ్‌కుమార్‌ను అభినందించారు. “ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన దైవం” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను, ప్రజాసేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే భాగంలో ప్రజల కష్టాల్లో తాను ఎప్పుడూ ముందుంటానని (జీవీకే) గంటా.విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ వెంటే ఆపదలో ప్రజల పక్కనే. కష్టం అంటే నేనున్నా ఇదే జీవీకే గంటా.విజయ్‌కుమార్ సేవా విధానం. ఈ కార్యక్రమంలో ఉప్పాడ గ్రామ జనసేన ఇన్‌చార్జ్ (GVK ) గంటా.విజయ్ కుమార్ , జనసైనికులు, స్థానికులు పాల్గొన్నారు