Kaizer News

నవ్వుతో నెట్టింట గెలిచాడు!

నవ్వుతో నెట్టింట గెలిచాడు!

· State - Telangana · sakshi.com

ఏ మీమ్స్, రీల్స్‌లో చూసినా చివరలో అతనే. లారీ క్లీనర్‌ నుంచి మీమ్స్‌ స్టార్‌ వరకు ఆ నవ్వు ప్రపంచాన్నే చుట్టేసింది.. ఎన్నో మీమ్స్, రీల్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ అయింది.. కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది.. కానీ.. ఆ నవ్వు వెనుక ఓ బతుకు పోరాటం ఉంది.. పేదరికం కారణంగా మూడో తరగతితోనే చదువుకు దూరమైన ఓ బాలుడి కథ ఉంది. మొబైల్‌ లేకున్నా షార్ట్‌ ఫిల్మ్స్‌ తీస్తూ.. ప్రస్తుతం అరుణ్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటిస్తూ, సినీ పరిశ్రమలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. నటనపై ఆసక్తితో, తన కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం కష్టపడుతున్నాడు. 15 నుంచి 20 నిమిషాల నిడివితో కూడిన 20 షార్ట్‌ ఫిల్మ్స్‌ తీశాడు. సొంత మొబైల్‌ లేకున్నప్పటికీ ఇతరుల మొబైల్, కెమెరాలు వాడి తన, ఇతరుల చానళ్లలో షార్ట్‌ ఫిల్మ్స్‌ పోస్ట్‌ చేస్తున్నాడు. సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నానని అరుణ్‌కుమార్‌ ‘సాక్షి’తో తెలిపాడు. అయితే, అదే నవ్వు.. అతడి జీవితానికి కొత్త దారిని చూపించింది. లారీ క్లీనర్‌గా చిరుజీవితం గడుపుతున్న బాలుడిని సోష­ల్‌ మీడియా స్టార్‌గా చేసింది. మధ్యలో ఆగిపోయిన చదు­వును మళ్లీ కొనసాగించాలనే అతడి ఆశకు ఊపిరిపోసింది. ఆ నిష్కల్మషమైన నవ్వునే తన కలలకు మెట్లుగా చేసుకుని ముందుకెళ్లేలా చేసింది. అతడే అరుణ్‌కుమార్‌. రీల్స్‌ చివర్లో అతడి నవ్వును చూస్తే చాలు.. మనసుకు ఎంతో హాయి అనిపిస్తుంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మాదారం గ్రామానికి చెందిన బచ్చల లక్ష్మీసమ్మయ్య, రాజేశ్వరిల కుమారుడు అరుణ్‌కుమార్‌ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మూడో తరగతితోనే ఆపేశాడు. చదువుకోవాలనే ఆశ ఉన్నా, కుటుంబ పరిస్థితులు అతన్ని కూలి పనుల వైపు నడిపించాయి. అదే గ్రామానికి చెందిన తన బావ నెహ్రూ లారీపై క్లీనర్‌గా పని చేశాడు. ఆ సమయంలో భూపాలపల్లిలో లారీలో నుంచి బొగ్గు అన్‌లోడ్‌ చేసే క్రమంలో టీ తాగుతుండగా నెహ్రూ వేసిన ఓ జోక్‌కు అరుణ్‌కుమార్‌ తనివితీరా నవ్వాడు. ఆ నిష్కల్మషమైన, గుండెల్లోంచి వచ్చిన నవ్వు నెటిజన్లను ఎంతగా ఆకట్టుకుందంటే, ఆ వీడియో కొద్ది కాలంలోనే వైరల్‌ అయిపోయింది. మీమ్స్, రీల్స్‌లో ఎక్కడ చూసినా అరుణ్‌ నవ్వే దర్శనమివ్వడం మొదలైంది. తన నవ్వు తెచ్చిన గుర్తింపు అరుణ్‌ జీవితానికి కొత్త దిశను చూపించింది. బావ నెహ్రూ ప్రోత్సాహంతో చదువుకోవాలనే తన పాత కలని గుర్తుచేసుకున్నాడు. ఓపెన్‌ స్కూలింగ్‌ ద్వారా పరీక్షలు రాసి, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాడు. - భూపాలపల్లి ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం

Original source: sakshi.com
Read more on Kaizer News