Sultanabad: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల నిధులతో నూతనంగా నిర్మాణం చేపట్టిన “ఇందిరమ్మ ఇండ్లను” ఆదివారం సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని తెలిపారు. గృహ ప్రవేశాల కార్యక్రమానికి ముందు, పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన పలు వివాహ వేడుకలు మరియు శుభాకార్యాల్లో విజయరమణ రావు గారు పాల్గొని నూతన దంపతులను, కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పన్నాల రాములు, స్థానిక సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు