Kaizer News

శరవేగంగా కొడవటంచ స్వామి ఆలయ అభివృద్ధి పనులు

శరవేగంగా కొడవటంచ స్వామి ఆలయ అభివృద్ధి పనులు

· State - Telangana · prabhanews.com

శరవేగంగా కొడవటంచ స్వామి ఆలయ అభివృద్ధి పనులు కోనేరు నిర్మాణ పనుల‌ పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర రేగొండ, ఆంధ్రప్రభ: జయశంకర్ జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ స్వామి దేవాలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆదివారం ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న కోనేరు నిర్మాణ పనులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులతో కలిసి పరిశీలించారు. కోనేరు నిర్మాణ ప్రణాళికను పరిశీలించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. కోనేరు నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని చెప్పారు

Original source: prabhanews.com
Read more on Kaizer News