Kaizer News

నేటి నుంచి ఎంబీబీఎస్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

నేటి నుంచి ఎంబీబీఎస్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

· State - Telangana · sakshi.com

తుది మెరిట్‌ జాబితా విడుదల చేసిన కాళోజీ యూనివర్సిటీ సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల ప్రక్రియలో కీలక ఘట్టం ప్రారంభమైంది. కాంపిటెంట్‌ అథారిటీ కోటా (కన్వీనర్‌ కోటా) కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తుది మెరిట్‌ జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. అర్హత సాధించిన అభ్యర్థులతో ఎంబీబీఎస్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. నేటి ఉదయం 6 నుంచి.. తొలి విడతలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ మైనారిటీ, నాన్‌మైనారిటీ వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే ఆప్షన్ల ప్రక్రియ సెపె్టంబర్‌ 1 మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది. అభ్యర్థులు tsmedadm. tsche.in వెబ్‌సైట్‌లో ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఆప్షన్లు ఇవ్వకపోతే.. తొలి విడత కౌన్సెలింగ్‌లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేయని అభ్యర్థులు తదుపరి విడతల్లో ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అర్హులు కారు. సీట్లను బ్లాక్‌ చేయకుండా ఉండేందుకు ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. ఆప్షన్‌ ప్రకారం సీటు పొందినా, కేటాయించిన కళాశాలలో చేరని అభ్యర్థులకు కూడా తదుపరి కౌన్సెలింగ్‌ దశల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉండదు. సీట్లు కేటాయించిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ చెల్లింపు ద్వారా రూ.12,000 వర్సిటీ ఫీజు చెల్లించి అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం ఆర్డర్‌లో పేర్కొన్న గడువులో సంబంధిత కళాశాలలో చేరి అసలు ధ్రువపత్రాలు, అవసరమైన బాండ్లు సమర్పించడంతోపాటు ట్యూషన్, కళాశాల ఫీజులు చెల్లించాలి. గడువులో చేరకపోతే సీటు రద్దవుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూషన్‌ ఫీజును సంబంధిత కళాశాల ప్రకటించిన విధంగా, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. కళాశాలలో అసలు ధ్రువపత్రాల తుది పరిశీలన జరుగుతుంది. పత్రాల్లో తేడాలు తేలితే తాత్కాలిక సీటు కేటాయింపును రద్దు చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఓటీపీతోనే నమోదు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసే సమయంలో అభ్యర్థి నమోదిత మొబైల్‌ నంబర్‌కు ఆరు అక్షరాలతో కూడిన వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ వస్తుంది. సీటు కేటాయింపు అనంతరం ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందుతుంది. ఆప్షన్లు సేవ్‌ చేసిన తర్వాత తప్పనిసరిగా ప్రింట్‌ తీసుకోవాలని వర్సిటీ సూచించింది. తొలి విడత సీట్ల వివరాలతో కూడిన సీట్‌ మ్యాట్రిక్స్‌ను వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు దానిని పరిశీలించి తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) హైదరాబాద్ లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) ప్రశ్నించినందుకు TDP ఆఫీస్ కు లాక్కెళ్లి కొట్టారు.. చంద్రబాబు, పవన్, లోకేష్ ల హెలికాప్టర్లు ఖర్చు 110 కోట్లా

Original source: sakshi.com
Read more on Kaizer News