Kaizer News

వైభవంగా 18 అడుగుల శివలింగం, నందీశ్వర విగ్రహ ప్రతిష

వైభవంగా 18 అడుగుల శివలింగం, నందీశ్వర విగ్రహ ప్రతిష్ఠ

· State - Telangana · prabhanews.com

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: మండలంలోని రాయంపల్లి గ్రామం వద్ద శ్రీ పర్వతేశ్వరస్వామి దేవాలయం ఎదుట ఏర్పాటు చేసిన 18 అడుగుల శివలింగం, శ్రీ నందీశ్వర శిలా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి జీవసమాధి వద్ద రుద్రాభిషేకం, యంత్ర ప్రతిష్ఠ, శివలింగం, నందీశ్వర విగ్రహ ప్రతిష్ఠ, విశేష అలంకారం, జయాది హోమం, బలిహరణ, పూర్ణాహుతి, అష్టోత్తర పూజ, మహానైవేద్యం, మహామంగళహారతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఉరవకొండ గవిమఠం సంస్థానం డాక్టర్ కరిబసవ రాజేంద్ర మహాస్వాములు, పాల్తూరు కల్లుహళ్లి మఠం సంస్థానం శ్రీ చెన్నవీర శివాచార్య మహాస్వాములు, శ్రీమాత గురుచరణానందగిరి మాతాజీ, కుక్కరచేడు గురుసేవాశ్రమం శ్రీ శంకరానందగిరి స్వాములు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News