Kaizer News

రాజమౌళి చేతుల మీదుగా ‘సిగ్మా’ ట్రైలర్‌ లాంచ్‌.. ఫన

రాజమౌళి చేతుల మీదుగా ‘సిగ్మా’ ట్రైలర్‌ లాంచ్‌.. ఫన్‌ రైడ్‌లా మూవీ

· State - Telangana · v6velugu.com

సందీప్ కిషన్ హీరోగా నటించిన యాక్షన్-అడ్వెంచర్, హీస్ట్ కామెడీ మూవీ ‘సిగ్మా’. తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై సుభాస్కరన్ నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దర్శకుడు రాజమౌళి లాంచ్‌‌‌‌‌‌‌‌ చేశారు. కామెడీ, అడ్వంచర్స్‌‌‌‌‌‌‌‌, యాక్షన్‌‌‌‌‌‌‌‌తో కూడిన ఫన్‌‌‌‌‌‌‌‌ రైడ్‌‌‌‌‌‌‌‌లా ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకుందని, సినిమా కూడా ఇదే స్థాయిలో మెప్పించాలంటూ ఆయన టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్‌‌‌‌‌‌‌‌ విషెస్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ఇక ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయానికొస్తే.. డ్రగ్స్, గ్యాంబ్లింగ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన రూ.500 కోట్ల భారీ స్కామ్‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో జరిగే కథ ఇది. మోసపోయిన హీరో తనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు తన లవర్‌‌‌‌‌‌‌‌, స్నేహితులతో భారీ హీస్ట్‌‌‌‌‌‌‌‌కు ప్లాన్ చేస్తాడు. క్రైమ్, మోసం, ప్రమాదాలతో కూడిన ఆ ప్రపంచంలోని అడ్డంకులను ఎదుర్కొని తన లక్ష్యాన్ని ఎలా సాధించాడనేది యాక్షన్, అడ్వెంచర్, ఫన్, ఎమోషన్‌‌‌‌‌‌‌‌ను జోడించి ఎంగేజింగ్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కించినట్టు ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అర్థమవుతోంది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2న సినిమా విడుదలవుతోంది. నైజాం, కోస్తాంధ్రలో మైత్రి సంస్థ, సీడెడ్‌‌‌‌‌‌‌‌లో ఎన్వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమా విడుదల చేస్తున్నాయి

Original source: v6velugu.com
Read more on Kaizer News