Shorts ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో ప్రతిష్టించిన గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఇటీవల జిల్లాకు ఎయిర్పోర్ట్ మంజూరు కావడాన్నీ హర్షిస్తూ ప్రధాని మోడీ, ఎమ్మెల్యే పాయల్ శంకర్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విమానంపై గణేష్ నిమర్జనం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన విమానం నమూనా పై గణేష్ విగ్రహాన్ని ఉంచి నిమజ్జన శోభాయాత్ర చేపట్టారు. ఈ వినూత్న శోభాయాత్రను చూడడానికి ప్రజలు ఆసక్తి చూపారు మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’