ఏడుగురి ప్రాణాలను మింగేసిన అతివేగం అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌తో పెరుగుతున్న ప్రమాదాలు.. ఒక్క తప్పిదం ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెడుతోంది వేగానికి బ్రేక్ వేయాలి.. ప్రాణాలకు విలువ ఇవ్వాలి డ్రైవర్ల నిర్లక్ష్యం.. కుటుంబాల్లో అంతులేని విషాదం రోడ్డు భద్రతపై మళ్లీ ప్రశ్నలు.. డ్రైవర్ల అప్రమత్తతే ప్రాణ రక్షణ వివాహిత ఆత్మహత్య Rangareddy-Road Accidents | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి రంగారెడ్డి : “వేగం వద్దు.. ప్రాణం ముద్దు” అనే హెచ్చరికలు తరచూ వినిపిస్తున్నా.. కొందరు వాహనదారులు వాటిని పట్టించుకోవడం లేదు. ఫలితంగా క్షణాల వ్యవధిలోనే కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఈ రోజు (శనివారం) విషాద ఘటనలు రోడ్డు భద్రతపై మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. శంషాబాద్ మండలం పాల్మాకుల్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా.. శామీర్‌పేట పరిధిలో ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లోనూ వేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు. ఒక వైపు రోడ్డు ప్రమాదాలు.. మరోవైపు కుటుంబ కలహాలు, వేధింపులతో యువతుల బలవన్మరణాలు.. ఇలా వరుస ఘటనలు సమాజాన్ని కలచివేస్తున్నాయి. ఒక్క క్షణం ఆలోచన లోపిస్తే ప్రాణాలు పోతాయని ఈ ఘటనలు హెచ్చరిస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం మెట్టుగూడ తండాకు చెందిన కేతావత్ లింబ్య (54), కేతావత్ జమున (45), కేతావత్ మాన్‌సింగ్ (48), కేతావత్ వస్రం (45) ఒకే కుటుంబానికి చెందిన వారు. వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు స్వగ్రామానికి వెళ్లిన వారు.. కార్యక్రమం ముగించుకుని రాత్రి శంషాబాద్‌లోని తమ నివాసానికి బయలుదేరారు. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా.. పాల్మాకుల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నబావత్ అశోక్ తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్‌రోడ్డుపై ముగ్గురు మృత్యువాతపడ్డారు. టైరు పంక్చర్ కావడంతో ఓ లారీని ఎమర్జెన్సీ లైన్‌లో నిలిపి మరమ్మతులు చేస్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లింకు (34), ఇస్మాయిల్ (26) అక్కడికక్కడే మృతి చెందగా.. ఇబ్రహీం (19) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వాహనాలను రోడ్డు పక్కన నిలిపే సమయంలో భద్రతా చర్యలు తీసుకోకపోవడం, వెనుక నుంచి వచ్చే వాహనాల వేగాన్ని అంచనా వేయకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. రోడ్డు ప్రమాదాల్లో వాహనం నడిపే వ్యక్తి అప్రమత్తత అత్యంత కీలకం. వేగం పెరిగి