Kaizer News

MLA Kavvampally Satyanarayana | యువజన సంఘాలను అణిచ

MLA Kavvampally Satyanarayana | యువజన సంఘాలను అణిచివేస్తున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి.. రాజీనామాకు డిమాండ్

· State - Telangana · ntnews.com

గన్నేరువరం, ఆగస్టు 30 : కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి నుండి గన్నేరువరం మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పోత్తూరు వరకు డబుల్ నిర్మాణం పూర్తి చేయాలని యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి లేకపోయినా యువజన సంఘాలు అనుకున్న సమయానికి వివిధ పార్టీల నాయకులు, ప్రజల మద్దతుతో నిరాహార దీక్ష చేపట్టిన స్థలానికి చేరుకోగా కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ వాహనాల్లోకి ఎక్కించారు. ఈ క్రమంలో పోలీసులకు, యువజన సంఘం నాయకులకు మధ్య పెనుగులాట జరిగింది. పలువురు యువజన సంఘాల నాయకులకు గాయాలయ్యాయి. అరెస్టు చేసి వారిని తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. యువజన సంఘాల నాయకులకు మద్దతు తెలపడానికి వచ్చిన ప్రజలు శాంతియుతంగా రోడ్డు కోసం నిరాహార దీక్ష చేస్తున్న నాయకులను అరెస్టు చేయడం ఏంటని, రోడ్డు పరిస్థితి ఎలా ఉందో అధికారులకు తెలియదని మండల ప్రజలు పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా యువజన సంఘాల అధ్యక్షుడు కాలువ నాగరాజు, మాజీ జెడ్పిటిసి మాడుగుల రవీందర్, రెడ్డి,అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిచిన 100 రోజుల్లో డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తానన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారంలోకి వచ్చిన 1000 రోజులు పూర్తయినా కంకర రోడ్డు వైపు కన్నెత్తి ఎందుకు చూడడం లేదని ప్రశ్నించారు. అధికారం కోసం నాడు యువజన సంఘాలతో కలిసి ధర్నాలు చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నేడు యువజన సంఘాలను అణిచివేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఉద్యమాన్ని ఆపలేరని హితవు పలికారు. ఎమ్మెల్యే కవ్వంపల్లికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి యువజన సంఘాలతో కలిసి నిరాహార దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ రోడ్డు కోసం నినదించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. యువజన సంఘాలకు పోటీగా కాంగ్రెస్ నాయకులు ఓ ర్యాలీ అదే రోజు చేయడం ఏంటని ప్రశ్నించారు. నిరాహార దీక్ష చేపడతామని పోలీస్ శాఖను అనుమతులు అడుగుతే అధికార బలంతో అనుమతులు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. గన్నేరువరం మండలంలో జరుగుతున్న అరాచకాన్ని మండల ప్రజలు గమనిస్తున్నారన్నారు. రోడ్డు వేయడం చేతగాని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. Switzerland | స్విట్జర్లాండ్ రేవ్ పార్టీలో కాల్పులు.. ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు వైభవంగా మార్వాడీల కావడి యాత్ర.. హరిహర మహాదేవ’ నామస్మరణతో సాగిన భక్తుల పాదయాత్ర TVK vs Cong | కాబోయే ప్ర‌ధాని విజ‌య్ అంటూ జోరుగా ప్ర‌చారం.. అధికార కూటిమిలో క‌ల‌క‌లం..!

Original source: ntnews.com
Read more on Kaizer News