Kaizer News

Nagarkurnool: ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఘనంగ

Nagarkurnool: ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

· State - Telangana · hmtvlive.com

నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ భాషా సంస్కర్త గిడుగు వెంకట రామమూర్తి జయంతిని స్మరించుకుంటూ ప్రతి ఏటా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుగు అధ్యాపకులు డాక్టర్ రాఘవేందర్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మదన్ మోహన్ మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి వ్యవహారిక భాషా ఉద్యమానికి పితామహుడని, తెలుగు భాష అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. విద్యార్థులు తెలుగు భాష పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల పూలతో పెద్ద అక్షరాల్లో “తెలుగు” అని ఆకట్టుకునేలా రూపొందించారు. అనంతరం విద్యార్థులు తెలుగు భాష ప్రాముఖ్యతపై ప్రసంగించడంతో పాటు పాటలు పాడి అలరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ అంజయ్య, ఐక్యూఏసి కోఆర్డినేటర్ వనిత, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఉమాదేవి, అధ్యాపకులు కోదండరాములు, రామకృష్ణ, శైలజతో పాటు ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News