Shorts Vijayawada: ముంబై /విజయవాడ (ఏసీఏ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం)భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 95వ వార్షిక సాధారణ సమావేశం ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో జరిగింది. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైక్యా, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, వివిధ రాష్ట్ర క్రికెట్ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు,కేశినేని శివనాథ్ (చిన్ని) సమావేశంలో పాల్గొన్నారు.భారత క్రికెట్‌ను మరింత పటిష్టం చేయడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్రికెట్ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం, రాష్ట్ర క్రికెట్ సంఘాలతో సమన్వయం పెంపొందించడం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా బీసీసీఐ ఆర్థిక వ్యవహారాలు, క్రికెట్ మౌలిక వసతుల అభివృద్ధి, స్టేడియాల ఆధునీకరణ, ఆటగాళ్లకు మెరుగైన సౌకర్యాల కల్పన, భవిష్యత్ క్రికెట్ అభివృద్ధి ప్రణాళికలు ప్రధాన చర్చనీయాంశాలుగా నిలిచాయి. బీసీసీఐ ఆర్థిక వ్యవహారాలు, క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల వినియోగం, రాష్ట్ర క్రికెట్ సంఘాలకు అందిస్తున్న సహకారం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. క్రికెట్ అభివృద్ధికి అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు, రాష్ట్ర స్థాయిలో క్రికెట్‌ను మరింత విస్తరించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ క్రీడాకారులను ప్రోత్సహించడం, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభను గుర్తించడం, వారికి నాణ్యమైన శిక్షణ, అత్యాధునిక సౌకర్యాలు అందించడం వంటి అంశాలపై చర్చ జరిగింది. ప్రతిభావంతులైన క్రీడాకారులకు చిన్న వయస్సు నుంచే సరైన వేదిక కల్పించడం ద్వారా భారత క్రికెట్ మరింత బలోపేతం అవుతుందని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దేశవ్యాప్తంగా క్రికెట్ స్టేడియాల్లో మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేయడం, ప్రేక్షకులు, ఆటగాళ్లు, అధికారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్టేడియాలను ఆధునీకరించడం వంటి అంశాలు సమావేశంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా క్రికెట్ మౌలిక వసతుల అభివృద్ధికి ఏసీఏ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడంతో పాటు, మహిళా క్రికెట్ సహా అన్ని విభాగాల్లో క్రికెట్ అభివృద్ధికి అవసరమైన చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల మధ్య సమన్వయంతో దేశంలో క్రికెట్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని సమావేశంలో చర్చించారు. భారత క్రికెట్‌కు మరింత బలమైన భవిష్యత్తును నిర్మించేందుకు మౌలిక వసతులు, యువ ప్రతిభ, పరిపాలన, ఆర్థిక వనరుల సమర్థ వినియోగం వంటి అన్ని అంశాలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’