Ellanthakunta: కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామం ఇల్లంతకుంట మండలం లో తెలంగాణ ఉద్యమకారులఫోరం రాష్ట్ర సెక్రెటరీ జనరల్ జిల్లా అధ్యక్షుడు ఎక్కటి.సంజీవరెడ్డి మాట్లాడుతూ,నిన్న కె కె కమిటీ సిఎం రేవంత్ రెడ్డిని కలసి కమిటీ నిర్ణయాలు తెలుపడం జరిగింది. దానికి సిఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో ఏ మాత్రం జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అదే విధంగా ఉద్యమకారులకు 250 గజాల స్థలం,పెన్షన్,హెల్త్ కార్డులు,ఉచిత RTC ప్రయాణం కల్పించడం పై సానుకూలంగా స్పందించి అదే విధంగా ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ పోర్టల్ ఏర్పాటు చేసి డిజిటల్ గా దరఖాస్తులు స్వీకరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇలా మాకు తీపి కబురు చెప్పినందుకు సీఎంకి కృతజ్ఞతలు తెలియజేసారు .అదే విధంగా FIR నమోదు ఐన వాళ్ళనే కాకుండా పోరాటం చేసిన వారు గ్రామాలలో మండలాలలో ఉన్న ప్రతి ఉద్యమకారుడిని గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజ్ కుమార్, మాజీ ఎంపిటిసి బీరయ్య, మహమ్మద్ లాల్, నాగేష్, సదానందం, సారయ్య, రాజా కుషావలి, వెంకటేష్ మహేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు