Kaizer News

Proddatur: వినాయక నిమజ్జనోత్సవంలో విద్యుత్ షాక్ -

Proddatur: వినాయక నిమజ్జనోత్సవంలో విద్యుత్ షాక్ - విద్యార్థి పరిస్థితి విషమం

· State - Telangana · hmtvlive.com

Shorts ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు ​పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ వీధిలో వినాయక నిమజ్జనోత్సవంలో ప్రమాదం చోటుచేసుకుంది. గణనాథుడిని నిమజ్జనానికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో, విద్యుత్ ప్లగ్ బాక్స్ బోర్డును పొరపాటున పీకడంతో సందీప్(16) అనే విద్యార్థి తీవ్ర విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా సెకండియర్ చదువుతున్నట్లు గుర్తించారు. విద్యుత్ షాక్ కారణంగా తీవ్రంగా గాయపడిన సందీప్‌ను వెంటనే గాంధీ రోడ్డులోని హోలిస్టిక్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ చుట్టుపక్కల వెంటనే విద్యుత్తు నిలిపివేశారు. ​ప్రస్తుతం సందీప్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి వద్ద సందీప్ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు స్థానికులను తీవ్రంగా కలచివేశాయి

Original source: hmtvlive.com
Read more on Kaizer News