Shorts గూడూరు: 45వ దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ మహాసభల్లో సాంస్కృతిక చరిత్ర విభాగానికి అధ్యక్షుడిగా ఎన్నికైన గూడూరు లోని ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకుడు డాక్టర్ గోవిందు సురేంద్రకు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. నవంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో జరగనున్న 45వ దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ మహాసభలకు సాంస్కృతిక చరిత్ర విభాగ అధ్యక్షుడిగా డాక్టర్ గోవిందు సురేంద్రకు ఆహ్వానం అందిన సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ గోవిందు సురేంద్ర జిల్లాలోని పలు చారిత్రక అంశాలపై విశేష పరిశోధనలు చేస్తూ, విద్యార్థుల్లో చరిత్ర పట్ల ఆసక్తిని పెంపొందిస్తూ చరిత్ర బోధనలో తన ప్రతిభను చాటుకుంటున్నారని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఇప్పటికే అనేక పరిశోధనా వ్యాసాలను రచించి, చారిత్రక పరిశోధనా రంగానికి విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రాంప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ ఎస్. కిరణ్మయి, డాక్టర్ యశోద, డాక్టర్ కె. లావణ్య, వి.వి.రమణారెడ్డి, ఏ.వి ప్రసాద్, అధ్యాపకేతర సిబ్బంది వినయ్, గోపాల్, జనార్దన్, శైలజ , సిబ్బంది అభినందించారు