Kaizer News

రైతులు విరివిగా కూరగాయల సాగు చెయ్యాలి : డిహెచ్ఎస్ఓ

రైతులు విరివిగా కూరగాయల సాగు చెయ్యాలి : డిహెచ్ఎస్ఓ శేఖర్

· State - Telangana · prabhanews.com

నాంపల్లి, ఆంధ్రప్రభ : ఆత్మ మునుగోడు డివిజన్‌ ఆధ్వర్యంలో నాంపల్లి మండలం టీపీ గౌరారం రైతు వేదికలో శుక్రవారం ఉద్యాన పంటల సాగు, యాజమాన్య పద్ధతులపై రైతులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. దొండ పందిరి సాగులో పండు ఈగ నివారణ, పంట మార్పిడి, ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యాన పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేవీకే కంపసాగర్‌ ఉద్యాన శాస్త్రవేత్త టీ. హిమబిందు రైతులకు అవగాహన కల్పించారు. జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల అధికారి టీ. శేఖర్‌ మాట్లాడుతూ ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులకు అనేక ప్రయోజనాలతో పాటు మంచి ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. డ్రిప్‌ పరికరాల ఏర్పాటుకు ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, వెనుకబడిన తరగతులకు 80 శాతం, ఓసీ వర్గాలకు 70 శాతం సబ్సిడీ అందుతుందని తెలిపారు. ఆయిల్‌పామ్‌ మొక్క నాటిన అనంతరం ఒక్కో మొక్కకు రూ.220 చొప్పున, ఎకరానికి రూ.4,200 చొప్పున నాలుగేళ్లపాటు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని వివరించారు. ఆయిల్‌పామ్‌ తోటలను ఒక్కసారి నాటితే సుమారు 35 సంవత్సరాల వరకు దిగుబడి పొందవచ్చని తెలిపారు. అనంతరం అధికారులతో కలిసి ఆయిల్‌పామ్‌, దొండ తోటలను సందర్శించారు. మునుగోడు డివిజన్‌ ఉద్యాన, పట్టుపరిశ్రమల అధికారి రావుల విద్యాసాగర్‌ మాట్లాడుతూ ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల్లో కూరగాయలు, పండ్లు, ఆయిల్‌పామ్‌ తోటలను ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఆత్మ మునుగోడు వ్యవసాయ డివిజన్‌ చైర్మన్‌ వేమిరెడ్డి సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను, వాటి ప్రయోజనాలను రైతులు విరివిగా వినియోగించుకోవాలని సూచించారు. రసాయనిక ఎరువులపై అధికంగా ఆధారపడకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తూ స్థానికంగా లభించే సేంద్రియ ఎరువులను వినియోగిస్తే సాగు ఖర్చులు తగ్గడంతో పాటు దిగుబడులు పెరిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో సుమారు 110 మంది రైతులు పాల్గొన్నారు. టీపీ గౌరారం సర్పంచ్‌ ఎం. లక్ష్మీప్రసన్న కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు రైతులకు ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలను వివరించి చైతన్యవంతులను చేయడం సంతోషకరమన్నారు. మల్లపురాజుపల్లి సర్పంచ్‌ మంటిపల్లి మణిమాల శ్రీశైలం యాదవ్‌, వడ్డేపల్లి సర్పంచ్‌ జంపాల లక్ష్మి సైదులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ అధికారి టీ. శేఖర్‌, మునుగోడు వ్యవసాయ డివిజన్‌ సహాయ సంచాలకులు (ఏడీఏ) బి. వేణుగోపాల్‌, శాస్త్రవేత్త టీ. హిమబిందు, నాంపల్లి మండల వ్యవసాయ అధికారి బండారు శివ, వ్యవసాయ విస్తరణాధికారి మౌనిక, హెచ్‌ఈఓ శ్రీను, పతాంజలి ఆయిల్‌పామ్‌ కంపెనీ నల్లగొండ జిల్లా నార్త్‌జోన్‌ టెక్నికల్‌ అడ్వైజర్‌ కే. హరీష్‌, ప్లాంటేషన్‌ ఆఫీసర్‌ పి. భానుచందర్‌, ఫీల్డ్‌ సిబ్బంది మోహన్‌, యాదయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీ గౌరారం సర్పంచ్‌ ఎం. లక్ష్మీప్రసన్న కృష్ణారెడ్డిని ఉద్యాన శాఖ అధికారులు శాలువాతో సన్మానించారు. ఆత్మ చైర్మన్‌ వేమిరెడ్డి సురేందర్‌రెడ్డి, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికా

Original source: prabhanews.com
Read more on Kaizer News