Kaizer News

మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..

మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..

· State - Telangana · prabhanews.com

జైపూర్, ఆంధ్రప్రభ: శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన వేలాల గ్రామంలోని గుట్టపై వెలసిన గట్టు మల్లన్న స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మండలంలోని వివిధ గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు గట్టు మల్లన్న స్వామికి అభిషేకాలు, అర్చనలు, పట్నాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో వేలాల గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్రామ సర్పంచ్ డేగ స్వప్న నాగేష్ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు

Original source: prabhanews.com
Read more on Kaizer News