రేవ్ పార్టీలో కాల్పుల కలకలం Andhra Prabha Top News ఉత్తర స్విట్జర్లాండ్‌లో ఆదివారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేపింది. అనేక మంది గాయపడినట్టు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనకు పూర్తి వివరాలు తెలియరాలేదు. ఒక రేవ్ పార్టీలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఆర్గావ్ (Aargau) ప్రాంతీయ పోలీసులు భారీ స్థాయి ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు లేదా ఫోటోలు ఏవైనా ఉంటే అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రముఖ ‘బ్లిక్’ (Blick) పత్రిక కథనం ప్రకారం, ఈ ఘటన ఒక ‘రేవ్ పార్టీ’ (rave party)లో జరిగింది